ఝరాసంగం ఏప్రిల్ 12, (జనంసాక్షి )జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నాలుగు సంవత్సరాల ప్రోబేషన్ కాలం పూర్తి అయినందున ఎంపీడీఓ సమావేశం మందిరంలో కేకు కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా కమిటీల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం సమావేశం నిర్వహించడం జరిగింది అని తెలిపారు.
జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని నాలుగు సంవత్సరాల ప్రొబేషనరి కాలం పూర్తి అయినందున జూనియర్ పంచాయతీ కార్యదర్శులను రెగ్యులర్ చేయాలని, ఇట్టి డిమాండ్ ను ప్రభుత్వానికి తెలపాలని ఎంపిడిఓ , ఎంపిఓ లకు వినతి పత్రంలో వివరించారు. లేనట్లయితే ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె కార్యాచరణ చేపడుతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో సీనియర్ పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
సంబరాలు జరుపుకున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులు




