జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని అంబేద్కర్ నగర్ లో దళితులను కించపరిచే విధంగా మా జాతి సోదరులైన “మాదిగ” అంటూ పదే పదే సంబోధిస్తూ దళితులను కించపరిచిన పుట్ట మధుకర్ వెంటనే క్షమాపణ చెప్పాలి అని దళిత న్యాయవాది ఆర్ల నాగరాజు డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన జడ్పీ చైర్మన్ హోదాలో ఉండి “షెడ్యూల్ కాస్ట్ ” అనే పదం ఉపయోగించాలని తెలవని మూర్ఖుడు జడ్పీ చైర్మన్ అని విమర్శించారు. మాదిగ అని సంబోధిస్తూ దళితులను కించపరచడం నువ్వు చదువుకున్న విజ్ఞానానికి వదిలేస్తున్నాం అని, క్షమాపణ చెప్పనియడలో పుట్ట మధు ఇంటిని దళిత సమాజం ముట్టడిస్తుందని హెచ్చరించారు.
పుట్ట మధుకర్ దళితులకు క్షమాపణ చెప్పాలి – దళిత న్యాయవాది ఆర్ల నాగరాజు డిమాండ్




