బదిలీల, ప్రమోషన్లు వెంటనే ప్రకటించాలి
* టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు భూక్యా కిషోర్ సింగ్
టేకులపల్లి, నవంబర్ 28 (జనం సాక్షి): ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్లను వెంటనే ప్రకటించాలని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు భూక్య కిషోర్ సింగ్డిమాండ్ చేశారు.సోమవారం టేకులపల్లి మండల టీఎస్ యుటిఎఫ్ మండల మహాసభను రామకృష్ణ రాజు ప్రాంగణంలో మండల కమిటీ అధ్యక్షులు మాలోతు బాలు నాయక్ అధ్యక్షతన ఈ మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్ బదిలీలపై కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగులకు రావలసిన మూడు డీ.ఎ లు కూడా ఇంతవరకు ప్రకటించలేదని, పి. ఆర్. సి కి సంబంధిత అనుసంధాన జీవోలను ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఏ విధంగా సిపిఎస్ ను రద్దుచేసి కొన్ని రాష్ట్రాలు పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాయని, ధనిక రాష్ట్రమని చెప్పుకుంటున్న తెలంగాణలో ఇంకా పాత పెన్షన్ అమలు కాకపోవడం పై విచారం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు వరలక్ష్మి,జిల్లా కార్యదర్శి హాథిరామ్, బాలు, రామచంద్రరావు మంగతాయి, మాన్సింగ్, రాంజీ, జానకి, జావిద్ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు




