పురాతన పంచలోహ విగ్రహం చోరీ
పీలేరు: చిత్తూరు జిల్లా ముడుపులవేముల పంచాయతీ తానాఒడ్డెపల్లి సమీపంలోని ఓదేటి ఎల్లమ్మ ఆలయంలో పురాతన పంచలోహ విగ్రహం చోరీకి గురైంది. దీని విలువ రూ.15 లక్షలు ఉంటుందని ఆలయ సిబ్బంది తెలియజేశారు. నిన్న రాత్రి గుడిలోకి ప్రవేశించిన దుండగులు విగ్రహంతోపాటు ఉండిలోని సొమ్మును దోచుకున్నారు. క్లూస్‌టీంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.