హుజూర్ నగర్ మే 3 (జనం సాక్షి):పులిచింతల నిర్వాసిత బాధితులకు తగిన న్యాయం చేస్తామని హుజూర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో హుజూర్ నగర్ ఆర్డిఓ వెంకారెడ్డి ఆధ్వర్యంలో పులిచింతల నిర్వాసితుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకట్రావు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి లు పాల్గొన్నారు. బుధవారం ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి పులిచింతల నిర్వాసితుల ఇబ్బందులు వారు ఎదుర్కొంటున్న సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్ళటం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు కూర్చున్నప్పుడు ఈ సమస్యలపై పక్కన ఆంధ్రా రాష్ట్రానికి తెలియజేసే ప్రయత్నం చేయడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతోనే పులిచింతల నిర్వాసితులకు ఏర్పాటు చేసిన ఆర్ అండ్ ఆర్ సెంటర్ లో కూడా అభివృద్ధి చెందడం జరిగింది. పులిచింతల నిర్వాసిత మార్కు కంటే కూడా ఇంకా ఇప్పుడు స్టోరేజ్ పెరగడంతో కొందరి భూమి కూడా నీట మునుగుతుండడంతో ఆ విషయాన్ని కూడా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్తున్నట్టు తెలిపారు. అంతేకాకుండానియోజకవర్గస్థాయిలో జరుగుతున్న అభివృద్ధిపై కూడా ఈ రివ్యూ మీటింగ్ లో చర్చించడం జరిగింది. అధికారులకు కూడా అందుకు తగినట్లు చేస్తున్న పనితీరుపై కూడా కలెక్టర్ ఆరా తీశారు. అధికారుల పనితీరుపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ వెంకా రెడ్డి, రెవెన్యూ అధికారులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




