డోర్నకల్ మే-3 :జనం సాక్షి న్యూస్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం హున్యతండా గ్రామ పరిధిలోని రాము తండాలో మూడు రోజుల నిర్వహించే బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా బుధవారం గొల్లచెర్ల గ్రామం నుండి రాము తండా వరకు బొడ్రాయి, ఆంజనేయ స్వామి,ముత్యాలమ్మ తల్లి విగ్రహాలు, ధ్వజ స్తంభాన్ని గ్రామ ప్రజలు,బొడ్రాయి కమిటీ సభ్యులు కలిసి ఆటపాటలతో, డిజె సప్పట్లతో భారీగా స్వాగతం పలుకుతూ ఊరేగింపుగా గ్రామానికి తీసుకురావడం జరిగింది.బొడ్రాయిస్థాపనతో గ్రామంలో బంధుమిత్రులతో పండుగ వాతావరణం ఏర్పడ్డది. అనంతరం అర్చకులచే గణపతి పూజ, త్రిశూల పూజ, అఖండ స్థాపన, సాయంత్రం పూట అంకురార్పణ, జలాధివాస, దాన్యాధివాసములు, అదేవిధంగా గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, పశు సంపాదనతో సుభిక్షంగా ఉండాలని మూర్తి,జల,రుద్ర చండీ హోమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బొడ్రాయి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజలుతదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




