Tuesday, 3 November 2026

పులిచింతల వెంకట్ రెడ్డి లేని లోటు పూడఛ్చలేనిది, ఆయన ఆశయాలను కొనసాగించాలి

హుజూర్ నగర్ మే 30 (జనంసాక్షి):
పులిచింతల వెంకట్ రెడ్డి లేని లోటు పూడఛ్చలేనిది, ఆయన ఆశయాలను కొనసాగించాలని సిపిఎం పార్టీ నాయకులు అన్నారు.సాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఆయకట్టు పరిరక్షణ కమిటీ సభ్యుడు సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు అయిన పులిచింతల వెంకట్ రెడ్డి సంతాప సభ కంబాల శ్రీనివాస్ అధ్యక్షతన సిపిఐ పార్టీ ఆఫీస్ నందు జరిగింది. ఈ సంతాప సభ సమావేశంలో ముందుగా వెంకట్ రెడ్డికి రెండు నిమిషాలు మౌనం పాటించి, పూలమాలలు వేసి నివాళులర్పించినారు.తదనంతరం జరిగిన సంతాప సభలో సిపిఐ పార్టీ రాష్ట్ర సమితి సభ్యులు గన్నా చంద్రశేఖర్ మాట్లాడుతూ పులిచింతల వెంకట్ రెడ్డి పట్టణానికి సిపిఎం పార్టీకి ఎనలేని సేవలందించారని, స్వతహాగా మధ్యతరగతి రైతైనప్పటికీ ఎప్పుడు పేదల పక్షాన, రైతుల పక్షాన పోరాడేవారన్నారు. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల కొరకు కమ్యూనిస్టు పార్టీలు పోరాటాలు చేశాయని, ఆ పోరాటాలలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు అనేక నిర్బంధాలను ఎదుర్కొన్నారని, పోలీస్ స్టేషన్లో పెట్టి చిత్రహింసలు పెట్టారని అలాంటి నిర్బంధాలను ఎదుర్కొన్న దానిలో భీమిరెడ్డి నరసింహారెడ్డి , రావి నారాయణరెడ్డి లాంటివారు ఉన్నారన్నారు. ప్రకాశం బ్యారేజీ నుండి బందరుకు స్వచ్ఛందంగా వేలాది మందిని తరలించి, కదిలించి రూపాయి ఖర్చు లేకుండా కాలువలను తవ్వించిన ఘనత కమ్యూనిస్టు పార్టీల దేనని అన్నారు. ఆ కమ్యూనిస్టు పార్టీలో సభ్యుడైన పులిచింతల వెంకట్ రెడ్డి అనేక పోరాటాలలో పాల్గొని రైతుల పక్షాన నిలబడ్డాడు అన్నారు. వారికి సిపిఐ రాష్ట్ర సమితి తరపున విప్లవ జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అన్నారు.
ఈ సంతాప సభలో ఆయకట్టు పరిరక్షణ కమిటీ కన్వీనర్ మేకల నాగేశ్వరరావు, ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ మాట్లాడుతూ 2015 లో ఏర్పడిన సాగర్ ఆయకట్టు పరిరక్షణ కమిటీ అనేక క్రియాశీల పోరాటాలను నిర్వహించిందన్నారు. ప్రపంచ బ్యాంకు నుండి కాల్వలను ఆధునికీకరించడానికి కేటాయించిన నిధులు దుర్వినియోగానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పులిచింతల వెంకటరెడ్డి పాత్ర చాలా గొప్పదన్నారు. నాడు ఎర్రవరం , లింగగిరి, కరక్కాయల గూడెం, మట్టపల్లి మేజర్ల కు కేటాయించిన 29 కోట్ల రూపాయల అవినీతిపై పోరాడాడన్నారు. అలాగే హుజూర్ నగర్ పట్టణంలో రైస్ మిల్లర్లు అన్యాయంగా రైతులు వద్ద నుండి తీసుకుంటున్న బస్తాకు రెండు కిలోలకు వ్యతిరేకంగా క్రియాశీల పోరాటాలు నిర్వహించారన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులను కదిలించి పట్టణంలోని ఇందిరా సెంటర్లో వందల ట్రాక్టర్లతో ధర్నా చేసి నిరసన తెలియజేసిన ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. ప్రజా సమస్యలను మంత్రులు అయిన హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకుపోయి ప్రభుత్వ అధికారులను నిలదీసి సమస్య పరిష్కరించే దానిలో తన వంతు పాత్ర పోషించాడు అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు పరిరక్షణ కమిటీ నాయకులు దొంగరి వెంకటేశ్వర్లు, అట్లూరి హరిబాబు, మామిడి వెంకటేశ్వర్లు, పల్లె వెంకట్ రెడ్డి, ఎలావుల రాములు, కాకి అజయ్, గుండు వెంకటేశ్వర్లు, దేవరం మల్లీశ్వరి, జడ శీను, దుగ్గి బ్రహ్మం, ఎల్లవుల రమేష్, గుండు రమేష్, గిన్ రెడ్డి వెంకట్ రెడ్డి, పిన్నపరెడ్డి వెంకట్రెడ్డి, కొప్పోజు సూర్యనారాయణ, పాశం వెంకట్ నారాయణ, మామిడి నరసయ్య, పొనుగుపాటి వాసుదేవరావు, సోమ గాని కృష్ణ, జక్కుల మల్లయ్య, బెల్లంకొండ రామ జోగి, పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు