Tuesday, 3 November 2026

భక్తుల విరాళాలతో అభివృద్ధి చెందుతున్న పెనుబల్లి ముత్యాలమ్మ గుడి

పెనుబల్లి, జూన్26(జనం సాక్షి) పెనుబల్లిగ్రామంలో వేంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి గుడి, గుడి ప్రాంగణం భక్తుల విరాళాలతో తో అభివృద్ధి చెందుతుంది, గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో గ్రామ దేవత గా కొలుసు కొనే గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లికి గతంలో గుడి మాత్రమే వుండేది, ఇటీవికాలంలో గుడి కమిటి సభ్యులు, భక్తులు కలసి ముత్యాలమ్మ గుడి ని అభివృద్ధి చేయాలని సంకల్పంతో భక్తులవిరాళాల తోగుడి ప్రాంగణాన్ని పెంచి గుడి అభివృధ్ది పనులు ప్రారంభించారు, గుడి ప్రాంగణంలో గతంలో దాత విరాలంతో సిమెంట్ పిల్లర్ ల తో స్లాబ్ వేసి శాశ్విత షెడ్ నిర్మించారు, అదే ప్రాంతంలో దాతల సహకారంతో మరో శాశ్విత షెడ్ కు పిల్లర్లు వేసి పనులు ప్రారంభించారు, అప్పటి నుండి తరచూ భక్తులు, దాతలు విరాళాలు ప్రకటిస్తూ ఉండడంతో, గుడికి ఐరన్ గ్రిల్స్ ఎర్పాటు చేయడం జరిగింది, ప్రస్తుతం గుడిలో పాలీష్ రాయి ఏర్పాటు చేయడం జరుగుతుంది, గుడికి మైక్ సెట్ కూడా భక్తులు అందచేసారు, ఒకప్పుడు ఈ ముత్యాలమ్మ గుడి విద్యుత్ సౌకర్యం లేక ఇరుకుగా భక్తులకు అసౌకర్యంగా వుండేది ఇప్పుడు దాతల సహకారంతో గుడి ప్రాంగణం పెరిగింది, గుడివద్ద మంచినీటి చేతి పంపు, విద్యుత్ సౌకర్యం వుండటం తో వందలాది మంది ప్రజలు నిత్యం త్రాగు నీరు తీసుకు వెళుతున్నారు, పెనుబల్లి, వంగా ముత్యాల బంజర్ గ్రామాలు ప్రజలు, భక్తులు గుడికి వచ్చి వెళ్ళడమే కాకుండా గుడి అభివృధ్ది లో కూడా భాగస్వాములు అవుతున్నారు, ఇప్పుడు ముత్తాలమ్మ దర్శనం కోసం, త్రాగు నీటి కోసం గుడికి రాకపోకలు పెరిగి సందడిగా మారింది. ముందు ముందు దాతల సహాకారంతో గ్రామ దేవత ముత్యాలమ్మ గుడి మరింత అభివృధ్ది చేస్తామని కమిటీ సభ్యులు, భక్తులు ఆశాభావం వ్యక్తంచేశారు