చేగుంట రిపోర్టర్ జనం సాక్షి మే చేగుంట7 మండలం చెట్ల తిమ్మాయిపల్లి పులిగుట తండాలో గత వారం రోజుల క్రితం పూరి గుడిసెలు దగ్ధమైన సంఘటన తెలిసిన విషయమే ఈ సందర్భంగా శనివారం నాడు మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఉదయం పులిగుట్ట తండాను సందర్శించి పూరి గుడిసె బాధితులకు 20000 ఆర్థిక సాయం అందజేసినట్లు గ్రామ సర్పంచ్ మోహన్, ఉపసర్పంచ్ ముఖేష్ గౌడ్, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు, సువర్ణ సురేష్ చారి, ఆధ్వర్యంలో అందజేశారు అనంతరం ఈ సందర్భంగా వారితో మాట్లాడుతూ పూరి గుడిసె బాధితులకు ప్రభుత్వం నుండి వచ్చే సదుపాయాలను మొదటి ప్రాధాన్యత ఇస్తానని వారితో మాట్లాడారు.అదేవిధంగా చెట్ల తిమ్మాయిపల్లి గ్రామాన్ని సందర్శించి హనుమాన్ టెంపుల్ దేవాలయం సందర్శించారు అనంతరం దేవాలయంలో మొక్కుబడి చెల్లించుకుని హనుమాన్ టెంపుల్ దేవాలయముకు 50 వేలు నగదు విరాళం అందజేయడం జరిగిందని హనుమాన్ టెంపుల్ భక్తులు తెలిపారు అనంతరం చెట్ల తిమ్మాయిపల్లి గ్రామానికి చెందిన చేసినట్లు మైనార్టీ ఇర్ఫాన్ హుస్సేన్ గత పది రోజుల క్రితం రోడ్డు ప్రమాదం జరగగా ఇంటికి వెళ్లి పరామర్శించి అతను ఆరోగ్యం వివరాలు అడిగి తెలుసుకున్నట్లు స్థానిక గ్రామ సర్పంచ్ మోహన్, ఉప సర్పంచ్ ముఖేష్ గౌడ్, గ్రామ అధ్యక్షులు సువర్ణ సురేష్ చారి ఆధ్వర్యంలో 5000, రూపాయలు ఆర్థిక సాయం ఇవ్వడం జరిగిందని తెలిపారు.అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి చెట్ల తిమ్మాయిపల్లి టిఆర్ఎస్ సీనియర్ ప్రజా ప్రతినిధులతో మాట్లాడుతూ ఎలాంటి సమస్యలున్న వరి ధాన్యం కొనుగోలు సెంటర్లు పార్టీ నాయకులు ఐకెపి అధికారులకు సహకరించి మన పార్టీ మన రాష్ట్రం ఇతరులకు ఆదర్శంగా మనం నిలిచి రైతులకు సహకరించి త్వరగా వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో అమ్మే విధంగా వారికి రైతులకు సూచించాలని గ్రామ వార్డు సభ్యుల నుండి ఎంపీటీసీ వరకు ప్రతి ఒక్కరు పాల్గొని వరి ధాన్యం కొనుగోలు సెంటర్లో ప్రతి ఒక్కరు రైతులకు దగ్గర్లో ఉండి మన సేవలు వారికి సూచించాలని సంక్షేమ పథకాలు వారికి అందేలా కలిసికట్టుగా పనిచేయాలని ఎప్పుడు నేను మీతో ఉంటానని టిఆర్ఎస్ పార్టీ నాయకులతో గ్రామస్తులతో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా గ్రామ సర్పంచ్ మోహన్ ,ఉప సర్పంచ్ ముఖేష్ గౌడ్ ,గ్రామపంచాయతీ పాలకవర్గం సభ్యులు,టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సువర్ణ సురేష్ చారి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు,ఉమ్మడి మెదక్ జిల్లా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కి దుబ్బాక నియోజకవర్గం కు ఎమ్మెల్యే టికెట్ వచ్చిన సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు . ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి మోదాం శ్రీనివాస్ ఎంపిటిసి హోలియా నాయక్ మాజీ టిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బోనాల బాలు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు చిన్నోళ్ల ప్రభాకర్ టిఆర్ఎస్ సీనియర్ నాయకులు బట్టి నర్సాగౌడ్ టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు భారీ ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.




