మల్లాపూర్ ఏప్రిల్:29 (జనంసాక్షి)చరిత్రలో నిలిచిపోయేలా హైదరాబాద్ నడిబొడ్డున నూతన సెక్రటేరియట్ ను నిర్మించడం, దానికి రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టడం, నేడు సచివాలయాన్ని ప్రారంభించుకోవడం కేసీఆర్ విజన్ కు పాలనాదక్షతకు నిదర్శనం. భారత జాతి ప్రజలందరికి గర్వకారణం. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం, పనితీరు దేశానికే ఆదర్శం. అంబేద్కర్ తాత్వికతను అందిపుచ్చుకొని తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుంది. అలాగే కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని రాజోజి సాయిరాం చారి రేగుంట బిఆర్ఎస్ గ్రామ శాఖ జనరల్ సెక్రెటరీ అన్నారు.




