Thursday, 5 November 2026

స్థానిక కృష్ణవేణి ఉన్నత పాఠశాల భాగ్యనగర్ కాలనీ లో నేడు పాఠశాల విద్యార్థి విద్యార్థులకు వార్షిక క్రీడా పోటీలను నేటి ప్రారంభించారు

 ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల డైరెక్టర్ శ్రీ ఎంఏ సత్తార్ గారు విద్యార్థుల యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి పాఠశాల అంతర క్రీడా పోటీలను ప్రారంభించారు ఇందులో భాగంగా డైరెక్టర్ గారు మాట్లాడుతూ పాఠశాల విద్యార్థుల విద్యార్థులతో చదువుతోపాటు ఆటల పోటీలు కూడా ఎంతో అవసరమని ఆటల పోటీల వల్ల దేహ దారుఢ్యం కలిగి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి రఫత్ సుల్తానా గారు మాట్లాడుతూ విద్యార్థులందరూ చదువుతోపాటుగా ఆటల పోటీలలో రాణించాలని ఆటల ఆటల వల్ల కలిగే లాభాలను వివరించారు ఇందులో భాగంగా పాఠశాల విద్యార్తిని విద్యార్థులకు కబడ్డీ వాలీబాల్ ఖోఖో వంటి క్రీడలతో పాటుగా చదరంగం క్యారమ్స్ వంటి వి కూడా నిర్వహిస్తామని తెలిపారు