మంథని, జనం సాక్షి: కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడిన మహానుభావుడు, స్త్రీలు చదువుకోవాల్సిందే అని పట్టుబట్టి.. ప్రత్యేక పాఠశాలలను ఏర్పాటు చేసిన గొప్ప సంఘ సంస్కర్త, బడుగు, బలహీన, పీడిత వర్గాలకు అండగా నిలిచిన పోరాట యోధుడు మహాత్మా జ్యోతిరావు ఫూలే 197వ జయంతిని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. పట్టణంలోని మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పెండ్యాల రామ్ కుమార్, బీసీ సంక్షేమ సంఘం నాయకులు స్వర్ణకార సంఘ అధ్యక్షుడు గుండోజు ప్రవీణ్ కుమార్, బీసీ నాయకులు బోయిని నారాయణ, మున్సిపల్ వైస్ చైర్మన్ అరెపల్లి కుమార్ కౌన్సిలర్ కాయితి సమ్మయ్య, నాయకులు భీముని వెంకటస్వామి, పోతరవేనా క్రాంతి కుమార్, జెట్టి చందు, మిట్టపల్లి కిషోర్, సబ్బని సంతోష్, నీలం రమేష్, నక్క శంకర్, కైతోజు సమ్మయ్య లతోపాటు పలువురు పాల్గొన్నారు.




