భువనగిరి టౌన్ ( జనం సాక్షి:)–యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో మహాత్మా జ్యోతిబాపూలే! జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన డిసిసి అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆలేరు నియోజకవర్గ ఇంచార్జ్ బీర్ల అయిలయ్య. ,టిపిసిసి డెలికేట్ మెంబర్ తంగాళపల్లి రవికుమార్ ,కుడుకుల నగేష్ ,కల్లూరి రామచంద్రారెడ్డి, భువనగిరి పట్టణంలోని జగదేవపూర్ చౌరస్తా వద్ద మహాత్మా జ్యోతిబాపూలే 197వ జయంతి సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే ఫైళ్ళ శేఖర్ రెడ్డి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిసిసి డెలిగేట్ మెంబర్ తంగాలపల్లి రవికుమార్,కలెక్టర్ ప్రమీల సత్పతి పోల్గొని మహాత్మ జ్యోతిబాఫూలే విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన దీన జన బాంధవుడు అని అన్నారు.సమససమాజ స్థాపనలో మహాత్మ జ్యోతిబాపూలే గారి పాత్ర ఎంతో ఉందని తెలిపారు.భావితరాలకు నిత్యస్పూర్తిగా నిలిచిన మహానుభావుడు అనిఅన్నారు.మహాత్మ జ్యోతిబాపూలే ఆశయాలను సాధించి వారి అడుగుజాడల్లో నడవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు చింతల కిష్టయ్య మార్కెట్ చైర్మన్ రైతు సమన్వయ కన్వీనర్ జడ్పిటిసి ,ఎంపిటిసి ,జూలకంటి ప్రవీణ్ మిర్యాల శ్రీనివాస్ బీసీ సంఘం కన్వీనర్ మాటూరి అశోక్ కో కన్వీనర్ రావుల రాజబు ,కొత్త నరసింహ స్వామి, పిట్టల బాలరాజు ,మచ్చ నరసింహ ,కడారి వెంకటేష్, ,కొత్త బాలరాజ్ ,,బీసీ సంక్షేమ అధికారులు నాయకులు, ప్రమోద్ కుమార్ బర్రె జహంగీర్ ఇరపాలక నరసింహ ,ప్రదీప్ ,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు..




