Wednesday, 4 November 2026

పెంట్లవెల్లి మండల పరిధిలోని కష్టపడి పండించిన మినుముల పంటకు నిప్పంటించిన దుండగులు

 

 

 

 

 

 

 

 

జనం సాక్షి కొల్లాపూర్ రూరల్ మార్చి 8
జటప్రోలు గ్రామానికి చెందిన కురువ మద్దిలేటి కుటుంబం దాదాపు కొన్ని సంవత్సరాలు నుండి వ్యవసాయం పైన ఆధారపడి ,కౌలుకు పొలాన్ని తీసుకొని వ్యవసాయం చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. జటప్రోలు గ్రామ శివారులోని చాపల దాసు అనే వ్యక్తి దగ్గర ఐదు ఎకరాలు భూమిని ఎకరా ఎనిమిది వేల రూపాయల లాగా కవులకు వేసుకొని, పంట పండించారు పంట మొత్తం పొలంలోనే రెండు చోట్ల మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు కుప్పలుగా పెట్టి తిరిగి ఇంటికి చేరుకున్నారు బుధవారం మినుములు పట్టే మిషన్ తీసుకెళ్లడానికి గ్రామంలో ఒకరి దగ్గర మిషన్ మాట్లాడి తీసుకెళ్లే సందర్భంలో పక్కనే ఉన్న రైతు ఫోన్ చేసి మీ పంట మొత్తం ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించారని మీరు త్వరగా పొలం దగ్గరికి రావాలని సమాచారం ఇచ్చారు. విషయం తెలిసిన రైతు కురువ మద్దిలేటి సంఘటన స్థలానికి వెళ్లి చూడగా పంట మొత్తం బూడిదై నేలపాలు అయింది. దాదాపు దాని విలువ 5 లక్షల రూపాయలు మేరకు నష్టం ఉందని రైతు ఆవేదనతో తన భార్య కొడుకును తీసుకొని పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ కు చేరుకొని అనుమానం ఉన్న వ్యక్తుల పేర్లను ఏఎస్ఐ చంద్రయ్యకు తెలిపాడు,
ఏఎస్ఐ చంద్రయ్య వివరణ కోరగా, కౌలు రైతు కురువ మద్దిలేటి తెలిపిన వివరాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.