అధికారులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశాలు
హైదరాబాద్,అక్టోబర్27(జనంసాక్షి): పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. మంగళవారం పంచాయతీరాజ్, గ్రావిూణాభివృద్ధి శాఖల్లో పెండింగ్ పనుల ప్రగతి, రైతు వేదికల నిర్మాణం, పీఎంజీఎస్‌వై రోడ్ల పనులపై ఉన్నతాధికారులతో మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఆయన సవిూక్ష నిర్వహించారు.
నిర్ణీత లక్ష్యానికి అనుగుణంగా పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రైతు వేదికలు, రోడ్లు, ఇతర పనులన్నీ నాణ్యతా ప్రమాణాలకనుగుణంగా జరిగేలా చూడాలని అన్నారు. అభివృద్ధి పనుల్లో ఆలస్యం చేస్తే చర్యలు తప్పవని, అధికారులు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన పనులన్నీంటిని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు.
పెండింగ్ పనులు సత్వరం పూర్తి చేయాలి




