మాకంటే రెండు పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకొండ్రి
– మంత్రి తారక రామారావు
రుద్రంగి కేజీబీవీ నూతన భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రుద్రంగి డిసెంబర్ 20 (జనం సాక్షి)
మాకంటే రెండు పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకొండ్రి ప్రతిపక్షాలకు సవాల్ విసిగిన మంత్రి కేటీఆర్ ఆయన మంగళవారం రుద్రంగి మండల కేంద్రము లో రూ.3 కోట్ల 50 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన కేజీబీవీ నీ ప్రారంభించారు.ఆయనతో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి,ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు,జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి,రావుల శ్రీధర్ రెడ్డి, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్య,జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షులు గడ్డం నర్సయ్య, ఎంపీపీ గంగం స్వరూప మహేష్, జడ్పిటిసి గట్ల మీనయ్య, సర్పంచ్ ప్రబలత మనోహర్ స్థానిక ప్రజాప్రతినిధులు,అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు నేతృత్వంలో వేములవాడ నియోజకవర్గం అన్ని రంగాలలో అభివృద్ధి సాధించిందని రుద్రంగి సమగ్ర అభివృద్ధి లో ముందజలో నిలుస్తుంది అన్నారు.అలాగే కేజీబీవీ కి రోడ్డు సౌకర్యం కల్పిస్తాo అని,పాత జూనియర్ కళాశాల భవనం స్థానంలో కొత్త జూనియర్ కళాశాల భవనం ను నిర్మిస్తామని,బండ మీద బడి కి కంప్యూటర్ ల్యాబ్ సంక్రాంతి లోగా మంజూరు చేస్తామన్నారు.రూ.2 కోట్లతో రుద్రంగి లో రోడ్లు అభివృద్ధి చేసి లైటింగ్ సౌకర్యం కల్పిస్తామని మహారాష్ట్ర కు చెందిన 14 గ్రామాల సర్పంచ్ లు, కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ లో విలీనం చేసుకోవాలని కోరుతున్నారు.2014 కు ముందు 29 లక్షల మందికి పెన్షన్ లు వచ్చేవని ఇప్పుడు పెన్షన్ మొత్తం ను పది రెట్లు పెంచి 46 లక్షల మందికి అందిస్తున్నామని.2014 కు ముందు మనిషి సచ్చిపోతే కరెంట్ కోసం అధికారులను ప్రాధేయ పడాల్సి వచ్చేది.దేశంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ నేే,తెలంగాణ లో 64 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో 9 విడతల కు జమ చేశాం.త్వరలో నే రైతు బంధు రూపంలో 7600 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తాం.రైతు భీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ,మిషన్ భగీరథ ద్వారా ఇంటికి నీటి గోస తీర్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ,రుద్రంగి లో ఫిబ్రవరి లో 30 పడకల ఆసుపత్రిని మంజూరు చేస్తాం మాకంటే రెండు పనులు ఎక్కువ చేసి ప్రజల మనసు గెలుచుకొండ్రి అని ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.రాజన్న సిరిసిల్ల లో 123 కోట్లు విద్య పై ఖర్చు పెట్టి జిల్లాలో అభివృద్ధి పనులు చేశాం తెలంగాణ లోని 26 వేల ప్రభుత్వం పాటశాలలు 7300 కోట్ల తో అభివృద్ధి చేస్తున్నాం జిల్లాలోని 490 ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం క్రింద మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం ఎవ్వరేమన్న ..ప్రజలందరి ఆశీస్సులు మా పై ఉన్నంత కాలం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామన్నారు.




