Tuesday, 3 November 2026

బి ఆర్ ఎస్ కు కోరం కనకయ్యతో సహా పలువురు ప్రజాప్రతినిధుల రాజీనామా జులై రెండు నాడు కాంగ్రెస్లో చేరిక

ఇల్లందు జూలై 1(జనం సాక్షి న్యూస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ఈ శనివారం రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరo కనకయ్య బీ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్లు వారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వారితోపాటు ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా 56 మంది సర్పంచులు, 26 మంది ఎంపీటీసీలు, ఒక మున్సిపల్ కౌన్సిలర్, ఒక జడ్పిటిసి టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారని సభాముఖంగా తెలియజేశారు. వీరందరూ జులై రెండు నాడు ఖమ్మంలో జరిగే జనగర్జన కాంగ్రెస్ పార్టీ సభలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.వీరి చేరికకు మద్దతుగా మహబూబాబాద్ పార్లమెంటరీ అభ్యర్థి, భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి అయినటువంటి విజయరామరావు వీరి చేరికకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కనకయ్య మాట్లాడుతూ..సీతారామ ప్రాజెక్ట్ శంకుస్థాపన మన నియోజకవర్గంలోనే చేసినప్పటికీ,నీటిని మాత్రం పక్క నియోజకవర్గాలకు దోచుకుపోతున్నా అడిగే దిక్కు మొక్కు లేకుండా పోవడం ఎంతగానో కలిచి వేసిందన్నారు.రేపు ఖమ్మం జిల్లాలో జరుగు తెలంగాణా జనగర్జన సభలో రాహుల్ గాంధీ,రేవంత్ రెడ్డి గార్ల ఆధ్వర్యంలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తో పాటుగా కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు.ఈ సందర్భంగా వారితో పాటుగా బీ ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేసిన వారిలో గార్ల మండల జెడ్పీటీసీ జాటోత్ ఝాన్సీ,వివిధ గ్రామ పంచాయతీలకు చెందిన 56 మంది సర్పంచులు,26 మంది ఎంపీటీసీలు,10 మంది ఉప సర్పంచులు,50 మంది వార్డు మెంబర్ల తో పాటుగా పలువురు నియోజకవర్గ ముఖ్యనాయకులు ఉన్నారు.