పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తా..!

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య
జనంసాక్షి, కమాన్ పూర్, అక్టోబర్ 10 : పెద్దపల్లి జిల్లాలోని మూడు నియోజకవర్గల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరెయడమే లక్ష్యంగా పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సూర సమ్మయ్య అన్నారు. పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పాలకుర్తి మండలం గన్ శ్యాందాస్ నగర్ గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూర సమ్మయ్య ని నియమిస్తూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఠాగూర్ మక్కన్ సింగ్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.
పాలకుర్తి మండలం గన్ శ్యాం దాస్ నగర్ గ్రామానికి చెందిన సూర సమ్మయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా,సింగల్ విండో డైరెక్టర్ గా, ప్రస్తుతం గన్ శ్యాం దాస్ నగర్ సర్పంచ్ గా, కెశోరాం సిమెంట్ కార్మిక సంఘం అధ్యక్షులుగా, కాంగ్రెస్ పార్టీలో చురుకైన నాయకునిగా ఉండడంతో మంథని శాసన సభ్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఈ పదవి అప్పగించారు. ఈ సందర్భంగా సూర సమ్మయ్య మాట్లాడుతూ… తన నియామనికి కృషి చేసిన మంథని శాసన సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీధర్ బాబు, జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ కి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం మరింత కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలిపారు.