Thursday, 5 November 2026

రంజాన్ కిట్ల పంపిణ.రంజాన్ కిట్ల పంపిణ. – జమాతే ఇస్లామే హింద్ ఆధ్వర్యంలో

 

 

 

 

బూర్గంపహాడ్ ఏప్రిల్ 16 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గుంపహాడ్ మండలం సారపాక  పట్టణంలోని సాజిదా మజీద్ లో జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో రంజాన్‌ తోఫా ఈద్‌ కిట్లను ఆదివారం పంపిణీ చేశారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు జమాతే ఇస్లామిక్ హింద్ వక్తలు మాట్లాడుతూ ఇస్లాం ఐదు మూలస్తంభాలలో నాలగవది. జకాత్ అనగా “శుద్ధి”, తన ఆదాయాన్ని శుద్ధి చేసుకోవడం, అనగా, తన ఆదాయంలో కొంత భాగాన్ని అవసరమున్నవారికి పంచి లేదా సహాయం చేసి తన సంపదను ధార్మికం చేసుకోవడం. ప్రతి ముస్లిం తన సాంవత్సరిక ఆదాయం, ధనములో 2.5% అల్లాహ్ మార్గంలో అవసరమున్నవారికి లేదా పేదవారికి సహాయం చేయాలి, ఈధార్మిక విధానాన్ని జకాత్ అంటారు. ఈ జకాత్ ను రంజాన్ మాసంలో లెక్కగట్టి చెల్లిస్తారని వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఐటిసి పి ఎస్ పి డి హెచ్ఆర్ శ్యామ్ కిరణ్ మాట్లాడుతూ తనకున్న దానిలో కొంత మొత్తాన్ని జకాత్‌ రూపంలో ఐటీసీ ముస్లిం ఎంప్లాయిస్ సోదరులు మరి కొంతమంది ముస్లిం సోదరులు కలసి ఈ కార్యక్రమాన్ని చేపట్టి నిరుపేదలు కూడా పండగ ఘనంగా జరుపుకోవాలని పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. జమాతే ఇస్లామిక్ హిందూ ఆధ్వర్యంలో 14 సంవత్సరాలుగా కార్యక్రమం చేపట్టటం అభినందననీయం  అన్నారు. గతంలో కూడా వరదల సమయంలో వీరి సేవలు ప్రశంసనీయం అన్నారు. ఇలాగే ప్రతి ఒక్కరూ పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో భాగవస్వాములైన ప్రతి ఒక్కరి కుటుంబం ఆయురారోగ్యాలతో వచ్చే సంవత్సరం ఈ సంవత్సరం కంటే ఎక్కువమందికి పంపిణీ చేసేలా వారి వారి ఆదాయం వనరులు పెరగాలని అభిలషించారు. కార్యక్రమంలో హెచ్ఆర్ మేనేజర్ మరిడాల శ్రీనివాస్  ఐటీసీ ట్రేడ్ యూనియన్ నాయకులు కనకమెడల హరిప్రసాద్, యారం పిచ్చిరెడ్డి, గోనే రామారావు, గాదె రామ్ కోటిరెడ్డి, జమాతే ఇస్లామిక్ హిందూ సారపాక పట్టణ కమిటీ అధ్యక్షులు జహీర్ పాషా సభ్యులు అలీమ్ భాయ్, షేక్ అబ్దుల్ సలీం, ఇషాక్ భాయ్, భాషరత్, సైదుద్దీన్, ఇమ్రాన్   తదితరులు పాల్గొన్నారు.