
పెనుబల్లి, జులై 7(జనం సాక్షి)
పెనుబల్లి డీసీసీబీ ఏటీఎం లొ రూ.1,10,000 లు గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చే శారని శుక్రవారం డిసిసిబి అధికారులు వి ఎం బంజర్ పోలీస్ స్టేషన్ లో పిరియాదు చేసినట్లు వి ఎం బంజర్ ఎస్ ఐ జీ. సూరజ్ తెలిపారు , వివరాల ప్రకారం జూన్ నెల 30 రాత్రి సమయంలో గర్తు తెలియని వ్యక్తులు ఏటీఎం లోకి ప్రవేశించి మిషన్ నుండి సాంకేతిక పద్ధతి ని ఉపయోగించి 11 సార్లు ఏటీఎం నుండి సుమారు లక్ష పదివేల రూపాయలు (1,10,000/-) డ్రాచేసారని పిర్యాదు లో పేర్కొన్నారు,శుక్రవారం ఏటీఎం మిషన్ లో అమౌంట్ తనిఖీ చేయగా ఎవరో గుర్తు తెలియని కొన్ని సాంకేతిక పద్ధతుల ద్వారా ఏటీఎం మెషిన్ నుండి పైన తెలిపిన అమౌంట్ డ్రా చేసినట్టు నిర్ధారించుకొని పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగిందని, దీనిపై ఎస్ఐ. సూరజ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ట్లు తెలిపారు.




