
జనంసాక్షి, రామగిరి : ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని బేగంపేట్ గ్రామంలో శుక్రవారం మంథని సీఐ సతీష్ ఆధ్వర్యంలో ఎస్ఐ లు రవి ప్రసాద్, మధుసుదన్ రావు, రాణి, దివ్య , 20 మంది పోలీసులు, ఎక్సైజ్ అధికారులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఆలం అంజి, పాముల భాస్కర్ దగ్గర 30 లీటర్ల గుడుంబా ఒక షైన్ బండి ను పోలీసులు పట్టుకున్నారు. అలాగే సరైన ధ్రువపత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ సతీష్ మాట్లాడుతూ…. నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
మంథని సీఐ సతీష్ , రామగిరి ఎస్ఐ రవి ప్రసాద్, దివ్య, మంథని ఎస్.ఐ మధుసూదన్ రావు, రాణి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
బేగంపేట లో “కమ్యూనిటీ కాంటాక్ట్” ప్రోగ్రాం – 30 లీటర్ల గుడుంబా, ఒక మోటార్ సైకిల్ స్వాధీనం – ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత : మంథని సీఐ సతీష్




