Thursday, 5 November 2026

పెనుబల్లి లొహాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర సన్నాహక సమావేశం

పెనుబల్లి లొహాథ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర సన్నాహక సమావేశం

పెనుబల్లి, జనవరి 11(జనం సాక్షి) పెనుబల్లి మండలం పెనుబల్లి గ్రామపంచాయితీ లో బుదవారం హాధ్ సే హాథ్ జోడో అభియాన్ యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగింది, ఈ సమావేశం
టి పి సి సి, డి పి సి సి
పిలుపు మేరకు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు, టీపీసీసీ కార్యనిర్వహక కమిటి సభ్యులు, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ ఆదేశాల మేరకు పెనుబల్లి మండల ఉపాధ్యక్షులు వడ్లమూడి కృష్ణయ్య అధ్యక్షతన చెలికాని రాజబాబు నివాస గృహం లొ
నిర్వహించడం జరిగింది,
ఈ కార్యక్రమానికి సత్తుపల్లి నియోజకవర్గ పి సి సి సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ హాథ్ సే హాథ్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వార్డులో, ప్రతి పోలింగ్ బూత్ లో, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ పాదయాత్ర ద్వారా నియోజకవర్గం తిరగటం జరుగుతుందని, ఈ సందర్భం గా బిఆర్ఎస్ , బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కుట్ర రాజకీయాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళ డం జరుగుతుందని, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, ప్రతి గ్రామంలోని అన్ని గడపలకి తీసుకెళ్ళి ,రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో వచ్చిన విన్నపాలను, వరంగల్ డిక్లరేషన్ ని వివరిస్తారని, ప్రతి ఒక్కరూ
రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈడా కమలాకర్, కాక వెంకటేశ్వరరావు, వాణీపతి రావు, పొట్లపల్లి వెంకటేశ్వరరావు,చిలుకబత్తుల చెన్నారావు, జిల్లెల్ల నరసింహాస్వామి, ఎస్ కే ఫకీర్ సాహెబ్, మామిళ్ళ కొండయ్య, భోగి నరసింహారావు, బెల్లంకొండ సీతారాములు, బన్నే రాంబాబు, Sk బాషా, మేకతొట్టి కాంతయ్య, బొర్రా రవి, మామిళ్ళ బుడ్డయ్య,రాజ్ కుమార్, బల్లి కాసులు, శీను, బెల్లంకొండ సత్యం తదితరులు పాల్గొన్నారు.