పెనుబల్లి, జూన్ 29(జనం సాక్షి) పెనుబల్లి కోదండ రామాలయం నుండి గురువారం తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా అయోధ్య రామరధం శోభాయాత్ర భక్తులలో భక్తి శ్రద్ధలతో రామనామ జపంతో జరిగింది, అయోధ్య నుండి ప్రారంభమైన రామరథం గ్రామాలలో శోభాయాత్ర నిర్వహిస్తూ తొలి ఏకాదశి పర్వదినం రోజున శ్రీ కోదండ రామాలయం వద్దకు చేరుకోవడం జరిగింది, కొడంద రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రామాలయం నుండి రామనామ సంకీర్తనలతొమంగళవాయిద్యాలతొ భక్తుల కోలాట సందడులతో అయోధ్యా రామారథం ఊరేగింపు “శోభాయాత్ర” పెనుబల్లి పురవీధులలో నిర్వహించగా భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గోన్నారు.
పెనుబల్లి లొ భక్తి శ్రద్ధలతో అయోధ్యరామరథ శోభాయాత్ర




