జనం సాక్షి,చెన్నారావుపేటమండలం లోని మాధవ నగర్ కాలనీ,ఎల్లయ గూడెం, చెరువు కొమ్ము తండా,చింతల తండా, నక్కలగుట్ట తండా,బోండా మాణిక్యం తండా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి పాదయాత్రను కొనసాగించారు.దొంతి కి ఎల్లయ్య గూడెం గ్రామానికి చెందిన మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య, యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్ ,ఉమ్మడి ఎల్లయగూడెం గ్రామాల కాంగ్రెస్ అద్యక్షులు నర్సు నాయక్,కనకమల్లు,రాందాస్ ,రమేష్ నాయక్ ,మహిళలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ కర్ణాటకలో వచ్చిన ఫలితమే తెలంగాణలో సునామీలా రాబోతుంది.బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే.ఈ విషయాన్ని మైనారిటీలు మదిలో పెట్టుకోవాలి.లౌకిక పార్టీ కాంగ్రెస్ ఓటు వేస్తేనే బిజెపికి వ్యతిరేకంగా వేసినట్టు అవుతుంది.మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇస్తానని మోసం చేసిన సీఎం కేసీఆర్కు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి.మంత్రి కేటీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలవడంతోనే బిజెపి, బిఆర్ఎస్ వేర్వేరు కాదని మరోసారి స్పష్టమైనది. పార్లమెంట్లో బిజెపి తీసుకువచ్చిన అనేక చట్టాలకు బిఆర్ఎస్ ఎంపీలు మద్దతు ఇచ్చారు.భారత్ జూడో యాత్రకు భయపడి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించిన మోడీ దురుద్దేశంతోనే రాహుల్ గాంధీని క్వార్టర్స్ ఖాళీ చేయించారు.కేంద్రం ఎలాంటి చట్టాలు తీసుకువచ్చినా మద్దతు తెలుపుతూ బిజెపితో బీఆర్ఎస్ కలిసి పని చేస్తుంది.రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో చెప్పాలి.రాష్ట్రంలో కాంగ్రెస్ లేకుండా చేయాలనే కుట్రలో భాగమే బిజెపి, బిఆర్ఎస్ రహస్య ఒప్పందం ప్రకారం పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు.తెలంగాణలో 50% ఉన్న బీసీలకు కేసీఆర్ ప్రభుత్వం ఐదు శాతం నిధులు కేటాయించి గోర్లు, బర్లు, చేపలంటూ దగా చేస్తున్నదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే బీసీలకు జనాభా దామాషా పద్ధతి ప్రకారం నిధులు కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం.కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు.నియామకాలు లేకపోవడంతో యూనివర్సిటీలు నిరుద్యోగులకు కేంద్రాలుగా మారాయి.రైతులు, నిరుద్యోగులు, చేతివృత్తులు, కుల వృత్తుల వాళ్లు అందరూ కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..రైతుబంధు మాత్రమే ఇచ్చి రైతుకు మిగిలిన అన్ని రకాల సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది.రాష్ట్రంలో పండించిన ధాన్యమును కొనే దిక్కులేదు, కాంట వేసిన ధాన్యానికి క్వింటాకు 12 కిలోల తరుగు ఇదేనా రైతు ప్రభుత్వం,బిఆర్ఎస్ రైతు వ్యతిరేక ప్రభుత్వం.నర్సంపేట నియోజకవర్గ ప్రజల స్పందన చూస్తుంటే వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని అన్నారు.కాంగ్రెస్ అధికారులకు రాగానే రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని నిరుద్యోగులకు వార్షిక క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తామని,రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితి ఐదు లక్షల రూపాయలకు పెంచుతామని,ఇల్లు లేని బీదలకు డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తామని,భూమిలేని నిరుపేదలకు సంవత్సరానికి 12 వేల రూపాయలు కూలి బందు ఇస్తామని,ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ప్రీమియం చెల్లించే విధంగా నిర్ణయం తీసుకుంటామని,ప్రజల సంపద ప్రజలకే చెందేలా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందాం.రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందని ఈ సందర్భంగా దొంతి అన్నారు.కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచక పాలన విసుగెత్తి ఎళ్లాయా గూడెం గ్రామానికి చెందిన యువ నాయకుడు ఈశ్వర్ దొంతి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పాలయి శ్రీనివాస్,మండల అద్యక్షులు భూక్య గోపాల్ నాయక్,ఓబీసీ జిలా అద్యక్షులు ఓర్సు తిరుపతి,మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,మండల ప్రధాన కార్యదర్శి మంచాల సదయ్య,వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్దేన రమేష్,కిరణ్ గౌడ్,సర్పంచ్ తూటి పావని రమేష్,భద్రు నాయక్,ఎంపీటీసీ రమాబాయి మైభూ సింగ్ రాథోడ్,మైనారిటీ సెల్ మండల అద్యక్షులు అమీరొద్దీన్,మండల నాయకులు భూక్య మోహన్ నాయక్,ధన్సింగ్,గ్రామ కాంగ్రెస్ అద్యక్షులు కనకమల్లు,బాణోత్ రమేష్ నాయక్,రాందాస్,నర్సు నాయక్,
పులిషేరు రాజేందర్, బాలునాయక్,శంకర్,హనుమ నాయక్,రవి నాయక్, ప్రభాకర్,భాస్కర్,రాందాస్,సతీష్,గోవింద్,కుమారస్వామి,యువజన కాంగ్రెస్ నియోజక వర్గ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్,యువజన కాంగ్రెస్ మండల అద్యక్షులు బండి హరీష్,పురుషోత్తం సురేష్,ఉప సర్పంచులు బాణోత్ వీరన్న,లింగస్వామి,భూక్య సురేష్,కూస సుదర్శన్,మల్లారెడ్డి,భిక్షపతి,జోరు వీరయ్య,చేవ్వా వెంకన్న,అబ్బయ్య,దరావత్ ప్రవీణ్,అఖిల్ ,యువజన కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ కు వేసే ప్రతి ఓటు బీజేపీ కి వేసినట్లే హాత్స్ సే హాత్ జోడో యాత్రలో దొంతి దొంతి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన ఈశ్వర్




