పెనుబల్లి, జూన్ 3(జనం సాక్షి)తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం పెనుబల్లి మండలంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు, పెనుబల్లి లో మాజీ ఎంపీటిసి, బి ఆర్ ఎస్ నాయకులు కోటగిరి సుధాకర్ బాబు ఆధ్వర్యంలో రైతు దినోత్సవ సందర్భగాపెనుబల్లి లో ట్రాక్టర్ల తో, మోటార్ సైకిళ్ళ తో కోలాహలంగా భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు, ఈ ర్యాలీలో పెనుబల్లి రైతు వేదిక పరిధిలోని వి ఎం బంజర్,బయన్నగుడెం, తుమ్మల పల్లి,రామచంద్రరావు బంజర్ గ్రామాల రైతులు పాల్గొని ర్యాలీని విజయ వంతం చేశారు, ర్యాలీలో కే సి ఆర్ ప్రభుత్వం రైతుల కోసం, ప్రజల కోసం ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాల ప్లెక్షీ లతో ర్యాలీ ని పెనుబల్లి లో కోటగిరి సుధాకర్ ఇంటి వద్దనుండి పెనుబల్లి,వి ఎం బంజర్ సెంటర్ మీదుగా రైతు వేదిక వద్దకు భారీగా ర్యాలీ నిర్వహించారు,అనంతరం రైతు వేదికలో తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పథకాల గురించి పలువురు నాయకులు రైతులకు వివరించారు,అనంతరం బి ఆర్ ఎస్ నాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు, వ్యవసాయ అధికారులు, రైతులు కలసి సహబంతి బోజనాలలో పాల్గోన్నారు, ఈ కార్యక్రమంలో వ్యవ సాయ అధి కారులు, పెనుబల్లి, వి ఎం బంజర్,బయన్నగూడెం, తుమ్మలపల్లి, రామచంద్ర రావు బంజర్ గ్రామాల సర్పంచ్ లు, ఎం పి టి సిలు,నాయకులు, కార్యకర్తలు, రైతులు, పాల్గోన్నారు.
పెనుబల్లి లో కోటగిరి సుధాకర్ ఆధ్వర్యంలో భారి రైతు ఉత్సవ ర్యాలీ




