Wednesday, 4 November 2026

పెరుమాండ్ల ‘బలగం’

వరంగల్ ఈస్ట్ మే 8 (జనం సాక్షి) బలగం సినిమా స్ఫూర్తితో పది సంవత్సరాలుగా దూరంగా ఉన్న అన్నా చెల్లెలు ఒకటై వారి అమ్మ పెరుమాండ్ల సుందరమ్మ 85వ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామంలోని చెన్నకేశవ ఆలయం ప్రాంగణంలో ఈ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పెరుమాండ్ల సుందరమ్మ – దివంగత రాంచందర్ దంపతుల కి ఐదుగురు కుమారులు, నలుగురు బిడ్డలు సంతానం. వీరితో పాటు కోడళ్ళు, అల్లుళ్ళు, మనవళ్ళు, మనమరల్లు కలిపి 102 మంది కుటుంబసభ్యులు బలగం సినిమా కి ఆకర్షితులై అందరూ ఒక్కటిగా సుందరమ్మ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బలగం సినిమా ప్రదర్శించడంతో అందరూ భావోద్వగానికి లోనయ్యారు. వారి సంతోషానికి అవధులు లేవు. ఈ కార్యక్రమం లో పెరుమాండ్ల మల్లికార్జున్,గోవర్ధన్, జనార్ధన్, విజయవర్ధ న్, మహేందర్, శాంతక్క, రమ, మాధవి తదితరులు పాల్గొన్నారు.