వీణవంక మే8 (జనం సాక్షి) వీణవంక మండలంలోని కిష్టంపేట గ్రామంలో రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని సర్పంచ్ బండారి ముత్తయ్య ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి
కెసిఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారని
కంటి వెలుగు పథకం భారతదేశంలో ఎక్కడా లేదన్నారు. బిజెపి పరిపాలించే రాష్ట్రాలలో ఎక్కడలేని పథకాలు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని చెప్పారు. కంటి చూపు సమస్యను నిర్లక్ష్యం చేయొద్దన్నారు.
కంటి పరీక్ష కేంద్రాలకు పోయి కంటి పరీక్షలు చె యించుకోవాలని అన్నారు కంటి చూపు తక్కువ ఉన్నవారికి పరీక్షలు నిర్వహించి కళ్ళజోడును అందించడమే కాకుండా అవసరమయ్యే వారికి శాస్త్ర చికిత్సలు కొరకు సంబంధిత ఆసుపత్రులకు పంపిస్తున్నామని అన్నారు చాలామంది తమకు చూపు తక్కువ ఉన్నవారు కంటి వెలుగు కేంద్రాలకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు
ఈ సువర్ణ అవకాశాన్ని కిష్టంపేట గ్రామంలో ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ శంకరయ్య, వార్డు సభ్యులు,
డాక్టర్ రవీందర్, ఏఎన్ఎం ఆశ వర్కర్లు, సభ్యులు,తోపాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు..




