Thursday, 5 November 2026

సర్వమత సామరస్యానికి ప్రతీక స్వరాష్ట్ర తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

 

 

 

 

 

 

వికారాబాద్ రూరల్ ఏప్రిల్ 15 జనం సాక్షిసర్వమత సామరస్యానికి ప్రతీక స్వరాష్ట్ర తెలంగాణ రాష్ట్రం అని వికారాబాద్ జిల్లా, బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ పేర్కొన్నారు శనివారం వికారాబాద్ పట్టణంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో ముస్లిం సోదర, సోదరిమనులకు రంజాన్ కానుకలుపంపిణి చేశారు.తెలంగాణ స్వరాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్అన్ని మతాలు అన్ని వర్గాల వారికి ప్రాధాన్యతలను కల్పిస్తూ.మునుపెన్నడు ఎరగని విధంగా అన్ని పండుగలకు కానుకలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అందరికీ సంక్షేమ ఫలాలను అందిస్తూ సర్వమత సామరష్యానికి ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ కుమార్ ఎంపీపీ చంద్రకళ కమల్ రెడ్డి పిఎసిఎస్ చైర్మన్ రెడ్డి మండల మైనార్టీ సెల్ అధ్యక్షులు సయ్యద్ గయాజ్ షఫీ ఉద్దీన్ ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, మైనార్టీ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.