Wednesday, 4 November 2026

పెళ్లిబృందంతో ఉన్న డిసిఎంను ఢీకొన్న లారీ

ఇద్దరి మృతి..పలువురికి గాయాలు
మేడ్చల్‌,ఫిబ్రవరి15(జ‌నంసాక్షి): ఆగి ఉన్న పెళ్లి బృదంద డీసీఎంను లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేటలోని తుర్కపల్లిలో జరిగింది. సీఐ నవీన్‌ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. సూరారం కాలనీకి  చెందిన పెళ్ళికూతురు దేవికి సిద్దిపేట జిల్లా మర్కుక్‌  మండలం అంగడి కిష్టాపూర్‌కు చెందిన శాంబయ్య కుమారుడు పరమేశ్వరకు 13 వ తేదీ వివాహం జరిగింది. రిసెప్షన్‌
నిమిత్తం అబ్బాయి ఇంటికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా మేడ్చల్‌ జిల్లా శావిూర్‌పేట్‌ మండలం తుర్కపల్లి అన్నపూర్ణ ¬టల్‌ వద్ద ఆగారు. ఈ సమంలో ఆగివున్న పెళ్లి డీసీఎంను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు జరిగింది. ఈ ప్రమాదంలో పెళ్లి కూతురు తరుపు బంధువులు రాజు(30), శ్రీనివాస్‌(38) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సూరారంలోని మల్లారెడ్డి, అల్వాల్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అల్వాల్‌లో చికిత్స పొందుతున్న ఐదుగురి పరిస్థితి విషమంగా ఉందని బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.