ఎల్కతుర్తి జూన్ 14 జనం సాక్షిహుస్నాబాద్ నియోజకవర్గం
కన్నారం గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి(JSR) గారిని రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమెందర్ రెడ్డి ఒక ప్రకటనలో విడుదల చేశారు. ఈ సందర్బంగా సురేందర్ రెడ్డి గారు మాట్లాడుతూ నాపై నమ్మకం తో ఈ అవకాశాన్ని కల్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పీ బండి సంజయ్ కుమార్ ,హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.గ్రామ గ్రామాన బీజేపీ పార్టీ పటిష్టతకు కృషి చేసి హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా JSR




