Thursday, 5 November 2026

పేకాట కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

పేకాట కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

వేమనపల్లి,జనవరి 12,(జనం సాక్షి):

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు,జూదం, పేకాట ఆడినా,నిర్వహించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నీల్వాయి ఎస్సై నరేష్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు నిఘా ఉంటుందన్నారు.కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు.చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించిన, పేకాట ఆడినా చర్యలు తప్పవన్నారు.ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాట కోడి పందాలకు దూరంగా ఉండాలని మండల ప్రజలకు ఎస్ఐ నరేష్ విజ్ఞప్తి చేశారు.