Thursday, 5 November 2026

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. – తహసీల్దార్ భూమేశ్వర్.

విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి.
– తహసీల్దార్ భూమేశ్వర్.
నెన్నెల, జనవరి 12, (జనంసాక్షి )
పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తహసీల్దార్ భూమేశ్వర్ అన్నారు. గురువారం అయన నెన్నెల మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ఒకవేళ నాసిరకంగా మధ్యాహ్న భోజనం పెడితే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మధ్యాహ్నం పరిశీలించి స్వయంగా విద్యార్థులకు వడ్డించారు. ఆయన వెంట రెవెన్యూ ఇన్స్పెక్టర్ గణేష్, హెచ్ ఎం నారాయణ, ఉపాధ్యాయులు ఉన్నారు