Thursday, 5 November 2026

పేకాట కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

పేకాట కోడి పందాలు ఆడితే చర్యలు తప్పవు

నెన్నెల,జనవరి 13,(జనం సాక్షి):

సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు,జూదం, పేకాట ఆడినా,నిర్వహించిన చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని నెన్నెల ఎస్సై రాజశేఖర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. కోడి పందాలకు ఎటువంటి అనుమతులు లేవని అన్నారు.చట్ట విరుద్ధంగా కోడి పందాలు నిర్వహించిన, పేకాట ఆడినా చర్యలు తప్పవన్నారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి పేకాట, కోడి పందాలకు దూరంగా ఉండాలని ఆయన మండల ప్రజలకు కోరారు. సుఖ సంతోషాలతో సంక్రాతి పండగ జరుపుకోవాలని సూచించారు.