పేకాట స్థావరంపై పోలిసులు మెరుపు దాడి.
12 మంది పేకాట రాయుళ్లపై కేసు నమోదు.
రూ,32,500, స్వాధీనం చేసుకున్న పోలిసులు.
దుబ్బాక ,27 నవంబర్ ( జనం సాక్షి )
పేకాట స్థావరంపై దుబ్బాక పోలీసులు మరోసారి కొరడా జులిపించారు. రెండు రోజుల క్రితం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పెద్దగుండవెల్లి గ్రామంలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసిన విషయం మరవకముందే, మళ్లీ గత అర్ధరాత్రి ఆకారం గ్రామంలో పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై మహేందర్ ఆధ్వర్యంలో దాడి చేశారు.12 మంది పేకాటరాయలను అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. పేకాటరాయుల నుండి 32,500 రూపాయలతో పాటు 12 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందని ఎస్సై మహేందర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ మాట్లాడుతూ, పేకాట ఎక్కడ ఆడిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పేకాట వల్ల కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తి ప్రాణాలు కోల్పోయే వరకు వస్తుందన్నారు. గ్రామాల్లో ఎక్కడ పేకాట ఆడిన పోలీసులకు సమాచారం అందిస్తే వారిని పట్టుకుని కేసులు నమోదు చేస్తామని ఎస్సై మహేందర్ తెలిపారు. పేకాట ఆడకుండా గ్రామస్తులు, మహిళలు పోలీసులకు సహకరించాలని కోరారు. పేకాట ఆడుతున్న విషయాన్ని పోలీసులకు తెలియజేసిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు




