Wednesday, 4 November 2026

పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదు : సీఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో పేదరికాన్ని అంచనా వేసే సరైన వ్యవస్థ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుఆర్‌రెడ్డి పేర్కొన్నారు. అందువల్లే రాష్ట్రంలో 7.5 కోట్ల తెల్లకార్డులు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ అధికారులు నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని చెప్పారు. నిజమైన పేదలను గుర్తించేందుకు శాస్త్రీయ పద్ధతిలోపనిచేసే వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని అన్నారు. బుధవారం ప్రభుత్వ శాఖలు లక్ష్యాలను ఎలా చేరుకోవాలన్న అంశంపై కేంద్ర ప్రభుత్వ విభాగమైన ఫెర్‌ఫార్మెన్స్‌ మేనేజ్‌మెంట్‌ డివిజన్‌ నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాపును సీఎం కిరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికాన్ని నిర్ధారించేందుకు సరైన ప్రమాణాలు లేని కారణంగా నిజమైన పేదలకు సంక్షేమ ఫలాలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏడున్నర కోట్ల తెల్లరేషన్‌ కార్డులున్నాయని సీఎం వీరందరినీ పేదలుగా చెప్పలేమని చెప్పారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మినీ మాథ్యూతో పాటు అన్ని శాఖల కార్యదర్శులు, పలువురు ఐఎఎస్‌లు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *