తెలంగాణ కోసం విద్యార్ధి ఆత్మహత్య
సీమాంధ్ర నేతల రెచ్చగోట్టె ప్రకటనలు టీ మంత్రులు సీఎంకు వంత పాడటంతోనే ఆత్మహత్యలు
హైదరాబాద్: నవంబర్ 7(జనంసాక్షి):తెలంగాణ కోసం ఆత్మహత్యకు పాల్పడ్డా సంతోష్ భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదాండరాం నివాళులర్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నా మోసానికి తెలంగాణ కోసం మరో విద్యార్ధి ఆత్మబలిదానం చేసుకున్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఎదుట ఉరివేసుకుని సంతోష్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెలంగాణ కోసమే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్‌నోట్‌లో సంతోష్ పేర్కొన్నాడు. ప్రభుత్వాలు మారినా. తెలంగాణ బతుకులు మారటం లేదని, తెలంగాణ ప్రజాప్రతినిధులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఎస్సీ భౌతిక శాస్త్రం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని సరస్వతి కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నట్లు సమాచారం. మృతుడి స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచ్చల్లాపూర్ గ్రామం. క్యాంపస్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. సంతోష్ భౌతికకాయానికి తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదాండరాం నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులు ఎవరు అత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. సీమాంధ్ర నేతల రెచ్చగోట్టె ప్రకటనలు, తెలంగాణ మంత్రులు సీఎంకు వంత పాడటంతోనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంతోష్ భౌతికకాయాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు సందర్శించాలని కోదాండరాం డిమాండ్ చేశారు.
తెలంగాణ వచ్చి తీరుతుంది… ఆత్మహత్యలు వద్దు : కేసీఆర్
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుందని అందువల్ల ఏ ఒక్క విద్యార్థి లేదా ఉద్యమకారులు ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర్ రావు మాట్లడుతూ బలిదానాలు వద్దు.. బలమైన ఉద్యమ కార్యచరణతో ఉద్యమించి తెలంగాణ సాధిద్దామన్నారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఉస్మానియా యూనివర్శిటీకి చెందిన సంతోష్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై కేసీఆర్ గారు స్పందిస్తూ ఎవరూ ఆత్మస్థెర్యం కోల్పోవద్దని కోరారు. విధ్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడే భాదకరమన్నారు. కరీంనగర్ జిల్లాలో జరిగే టీఆర్‌ఎస్ పోలిట్‌బ్యూరో సమవేశాల్లో కేసీఆర్ పాల్గోననున్నారు.
‘సంతోష్ ఆత్మహత్యకు కాంగ్రెస్ బాధత్య’
హైదరాబాద్: సంతోష్ ఆత్మహత్యకు కాంగ్రెస్సె బాధ్యత వహించాలని రాజకీయ విశ్లేషకులు వి. ప్రకాశ్ డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణలో జరుగుతున్న ఆత్మహత్యలకు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలె బాధ్యత వహించాలని, హైకమాండ్‌పై ఒత్తిడి తేవాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణ ఇవ్వకుండా కాంగ్రెస్ ఎన్నికలను పోయే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. తెలంగాణలో మళ్లీ బలిదానాలు జరగడం బాధాకారమన్నారు.
విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. సంతోష్ అనే విద్యార్థి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో స్వఛ్చందంగా విద్యాసంస్థలు మూసివేయాలని కోరింది, విద్యార్థులు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది.




