Saturday, 7 November 2026

పేదలకు తోడుగా ఉండడమే లక్ష్యం.

పేదలకు తోడుగా ఉండడమే లక్ష్యం..

-ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ సభ్యులు షేక్ సోందుపాషా
-నర్సంపేట కాలనీ వాసులకు దోమ తెరలు పంపిణీ
-రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు

కరకగూడెం,(జనంసాక్షి):సమాజంలోని నిరుపేదలకు ఎదో రూపంలో సాయపడి వారికి అండగా ఉండడమే ‘ప్రాణిక్ హీలింగ్ ఫౌండేషన్ ఆఫ్ సికింద్రాబాద్’ వారి లక్ష్యంమని ఆ ఫౌండేషన్ సభ్యులు,కరకగూడెం గ్రామీణ వైద్యులు షేక్ సోందుపాషా అన్నారు.ఈ మేరకు ఆయన బుధవారం మండల పరిధిలోని నర్సంపేట ఎస్సీ కాలనీ వాసులకు వారి కాలనీలో సుమారు 50 కుటుంబాలకు దోమ తెరలను పంపిణీ చేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయొద్దని దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, పైలేరియా వంటి రోగాలు వచ్చే అవకాశం ఉన్నందున విధిగా దోమ తెరలు వాడాలని సూచించారు.అంతేకాకుండా
ప్రజారోగ్యం దృష్ట్యా ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా రోగాల నివారణలో భాగంగా దోమ తెరలను పంపిణీ చేస్తున్నామన్నారు. వ్యాధులు ప్రబలకుండా వీటి వినియోగాన్ని గుర్తించాలని గ్రామస్తులను కోరారు.అదేవిధంగా ఏజెన్సీ ప్రాంత ప్రజల అవసరాలను గుర్తించి వారికి సేవ చేయడానికి తమ ఫౌండేషన్ ఎల్లప్పుడూ ముందుగా ఉంటుందని తెలిపారు.రానున్న రోజుల్లో మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు సమీర్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.