సుశ్రుత గ్రామీణ వైద్యుల మహాసభను విజయవంతం చేయాలి
కొండమల్లేపల్లి డిసెంబర్ 27 జనం సాక్షి న్యూస్ :
ఈనెల 30వ తేదీన నల్లగొండ జిల్లాలోని జరిగేటటువంటి సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాలకూరి వెంకటేశ్వర్లు గౌడ్, కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు జెట్టమోని యాదయ్య యాదవులు అన్నారు. మంగళవారం కొండమల్లేపల్లి పట్టణంలో గ్రామీణ వైద్యుల సంఘం మహాసభ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయా గ్రామాలలో పట్టణాలలో పనిచేస్తున్నటువంటి ఆర్ఎంపీ పి.ఎం.పి గ్రామీణ వైద్య మిత్రులందరికీ కూడా అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు ఈ సభకు ముఖ్య అతిథులుగా విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, తోపాటు మరికొంతమంది ప్రజాప్రతినిధులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా డివిజన్ అధ్యక్షులు ఏ కృష్ణారెడ్డి,జిల్లా నాయకులు బి శ్రీనివాస్, లక్షణాచారి, ఉట్కూరి వేమన్ రెడ్డి, సిహెచ్ శ్రీనివాసులు బిఏ చారి, మసూర్, బొడ్డుపల్లి ముత్యాలు, జె శ్రీకృష్ణ ,గోపాల్ చారి, వి ధనుంజయ, ఆంజనేయులు తదితర గ్రామీణ
సుశ్రుత గ్రామీణ వైద్యుల మహాసభను విజయవంతం చేయాలి




