కమాన్ పూర్, జనం సాక్షి : కమాన్ పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన పలువురు గనవేని నరసమ్మ, గాదె సతీష్, బర్ల కళావతి ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్సపొంది మంథని నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి సిఫారసు చేసుకోగా ముఖ్యమంత్రి సహాయనిధి నుండి గనవేన నరసమ్మ కు 28.000 /- రూ, గాదె సతీశ్ కు 22.000 /- రూ, బర్ల కళావతి కి 18.000/- మంజూరు కాగా ఇట్టి ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులను జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ ఆదేశాల మేరకు బుధవారం లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బిఆర్ఎస్ పార్టీ కమాన్ పూర్ మండలశాఖ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కును బిఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కమాన్ పూర్ మండల ఎంపీపీ రాచకొండ లక్ష్మీ, కమాన్ పూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి, స్థానిక ఉప సర్పంచ్ రాచకొండ చంద్రమౌళి, గుండారం బీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు దండే కిషన్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రాచకొండ రవి, దామెర సంపత్, గడప కృష్ణమూర్తి, ఆకుల గట్టయ్య, దండే కనకరత్నం, దండే రమేష్ ఠాగూర్, పిడుగు అంజి, బోయిని బాలకృష్ణ, దండే ప్రదీప్, బొడ్డు రవి, మోతె రాజయ్య, సాన సురేష్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
పేదలకు వరం ముఖ్యమంత్రి సహాయనిధి




