Wednesday, 4 November 2026

మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు ప్రభుత్వ పాఠశాలలొనే చేర్పించండి

 

 

 

 

;-ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించిన ప్రభుత్వ ఉపాధ్యాయులు

జనంసాక్షి, మంథని : బడిబాట కార్యక్రమంలో భాగంగా మంథని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలకు చెందిన ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గురువారం మంథని పట్టణంలోని విశ్వబ్రాహ్మణ వీధిలోమంథని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు చౌడారపు శ్రీనివాస్, బిరుదు మధు, వేణుగోపాల్, కాయిత గోపాల్, రజిత, సీమ, జీనత్ లు బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు ఇంటింటికి తిరిగి బడి ఈడు పిల్లలను బడిలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ప్రైవేటు బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల్లో విద్య బోధన జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు. విద్యార్థిని విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, రెండు జతల స్కూల్ యూనిఫాంలు, సన్న బియ్యంతో మధ్యాహ్న భోజనం సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు మా ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించాలని కోరారు. ఉపాధ్యాయుల అభ్యర్థనల మేరకు విద్యార్థుల తల్లిదండ్రులు సానుకూలంగానే స్పందించారు .