Thursday, 5 November 2026

పేదలకు వైద్యం అందించడమే లక్ష్యం

పేదలకు వైద్యం అందించడమే లక్ష్యం
రాష్ట్ర ఎఎంఐ అధ్యక్షుడు బి ఎన్ రావు
జనం సాక్షి కదలాపూర్
పేదలకు వైద్య పరంగా సహాయం చేయడం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు రాష్ట్ర ఎఎంఐ అధ్యక్షుడు బి.ఎన్.రావు అన్నారు. మండలంలోని ఊట్పల్లికి చెందిన లతీఫ్ అనే మహిళకు లైఫ్ లైన్ ఆసుపత్రిలో బి.ఎన్.రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కీళ్ల మార్పిడి చేయించారు ఈ సందర్భంగా శనివారం ఆ కుటుంబాన్ని అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతు కీళ్ల మార్పిడికి 1,70,000 అవసరం కాగా పేద మహిళలకు ఉచితంగా శాస్త్ర చికిత్స చేయించినట్లు తెలిపారు ఆర్థికంగా వెనుకబడి ఉన్న వైద్య సహాయం అందించడానికి ఫౌండేషన్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 40 వేల మంది వైద్యులు నెలకు ఒకరికి ఉచితంగా వైద్యం చేసినా కానీ 40 వేల మంది భిద పరిస్థితిలో ఉన్న వారికి సహాయం అందుతుందని అన్నారు. రొమ్ము సర్వైకల్ క్యాన్సర్ నిర్ధారణ కొరకు ఉచితంగా పరీక్షలు చేసి తెలుపుతున్నట్లు తెలిపారు. కథలాపూర్ మండల కేంద్రంలో జడ్పిటిసి నాగం భూమయ్య ఆధ్వర్యంలో ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి ఫోరం అధ్యక్షులు బొడ్డు బాలు, ఏఎంసి చైర్మన్ నాగేశ్వరరావు, వైస్ చైర్మన్ నాంపల్లి లింబాద్రి, కో ఆప్షన్ సభ్యులు మొహమ్మద్ రఫీ, సర్పంచ్ గజ్జల స్వామి, పొలాస శారద దేవయ్య, డైరెక్టర్ ఏజిబి మహేందర్, గుండారాపు గంగాధర్, గడ్డం భూమా రెడ్డి, ఎంపీపీ జవాజి రేవతి గణేష్ తదితరులు పాల్గొన్నారు