ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలి
జనం సాక్షి కదలాపూర్
కథలాపూర్ మండలంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలని ఎస్సై రామచంద్రమ్ గౌడ్ తెలిపారు. అంతర్జాతీయ మరుగుదొడ్డి దినోత్సవ సందర్భంగా మండల కేంద్రంలో టు కే రన్ ప్రారంభించి అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఇల్లు స్వచ్ఛందంగా ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి ఉండాలని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలంటే మరుగుదొడ్డి తప్పనిసరని పిలుపునిచ్చారు. కథలాపూర్ గ్రామపంచాయతీ నుండి సిరికొండ వరకు టు కే రన్ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రవీందర్, ఎంపీడీవో జనార్ధన్, సర్పంచ్ కంటే నీరజ సత్యనారాయణ, ఎంపిటిసి గసికంటి లతా వేణు, అంగన్వాడి కార్యకర్తలు టీచర్స్ కారోబర్ ఇస్మాయిల్, బండి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు
ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాలి




