జియాగూడలో ఇళ్లను ప్రారంభించిన మంత్రి కెటిఆర్
బహిరంగ మార్కెట్లో ఒక్కో ఇల్లు 50 లక్షల చేస్తుంది
ప్రారంభోత్సవంలో మంత్రి కెటిఆర్ వెల్లడి
14.88 కోట్ల ఖర్చుతో 840 ఇళ్ల నిర్మాణం
కేటాయింపులు సరిగా లేవంటూ మహిళల ఆందోళన
హైదరాబాద్,అక్టోబర్26(జనంసాక్షి): పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్నదని మంత్రి కెటిఆర్ తెలిపారు. పేదలు గౌరవంగా బతకాలని సిఎం కెసిఆర్ వీటిని అత్యతంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారని అన్నారు. పేదల సొంత ఇంటి కలను ప్రభుత్వం విజయదశమి కానుకగా సాకారం చేసిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబార్ నగరంలోని జియగూడలో డిగ్నిటీ హౌసింగ్ కాలనీని ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ క్రమంలో గోషామహల్ నియోజకవర్గంలోని గోడె కీ కబర్‌లో నూతనంగా నిర్మించిన 192 డబుల్ బెడ్ రూం ఇండ్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ ఇండ్ల నిర్మాణానికి రూ. 14.88 కోట్లు ఖర్చు చేశారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని, దఫాలుగా వాటిని ప్రజలకు అందిస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఉదయం జియాగూడలోని 840 ఇండ్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వస్తాయని.. ఇళ్ల కోసం ఎవ్వరికీ డబ్బులు ఇవ్వవలసిన పని లేదన్నారు. జియాగూడను అభివృద్ధి చేస్తామని, ఒక బస్తీ దవాఖాన కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారతదేశంలో ఏ ప్రభుత్వం.. ఎక్కడ కూడా ఇలాంటి ఇళ్లు కట్టలేదని అన్నారు. తాము కట్టిన ఇళ్లకు మార్కెట్ లో రూ.40 నుంచి రూ.50 లక్షల ఖర్చు అవుతాయని, మొత్తం 2.5లక్షల ఇళ్ళకు రూ. 18 వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఇచ్చిన ఇళ్లను ప్రజలు శుభ్రంగా ఉంచుకోవాలని, ఒక సొసైటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రి అన్నారు. జియాగూడ ప్రాంతంలో ఉన్న మూసీని సుందరీకరణ చేస్తామని, దాంతో ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు.
ఈ హౌసింగ్ కాలనీలో రూ.71.49 కోట్ల వ్యయంతో 840 రెండు పడకగదుల ఇళ్లు నిర్మించారని తెలిపారు. ఈ కాలనీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా పేదకుటుంబాల కోసం అవసరమైన అన్ని మౌలిక వసతులు ఉన్నాయన్నారు. తాగునీరు, విద్యుత్, సి సి రోడ్లు, షాపింగ్ కానీప్లెక్స్‌తో పాటు బస్తీ దవాఖాన వంటి ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించందన్నారు. పేదల సొంతింటి కలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని కేటీఆర్ చెప్పారు. టిఆర్‌ఎస్ ప్రభుత్వం పేదలకు 560 చదరపు అడుగలలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తోందని, రాష్ట్ర వ్యాప్తంగా 18 వేల కోట్ల రూపాయలతో 2 లక్షల 75 వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కడుతున్నామని ఆయన అన్నారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ పారదర్శకంగా ఉంటుంది. ఈ విషయంలో దళారులను నమ్మి మోసపోవద్దని ఆయన హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను దశల వారిగా ఇస్తామని కేటీఆర్ తెలిపారు. డిగ్నిటీ హౌసింగ్ కాలనీ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ¬ం మంత్రి మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్, జి హెచ్ ఎం సి కవిూషనర్ డి ఎస్ లోకేష్ కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శ్వేతమొహంతి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సభలో మహిళల ఆందోళన
కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతుండగానే సభా ప్రాంగణం వద్ద మహిళలు ఆందోళనకు దిగారు. కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా మహిళలు నినాదాలతో ¬రెత్తించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీని
పారదర్శకంగా చేయడంలేదంటూ మహిళల ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలకే ఇళ్లను కేటాయిస్తు న్నారని మిగిలిన వాళ్లను పట్టించుకోవట్లేదంటూ మహిళలు మండిపడ్డారు. అయితే మంత్రి కేటీఆర్ మాత్రం మహిళలు ఆందోళనపై మాట్లాడలేదు. అక్కడ ఏర్పాటు చేసిన బస్తీ దవఖానాను కేటీఆర్ ప్రారంభించి, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా డబుల్ ఇళ్లు




