పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి బాసట.

పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి బాసటగా నిలుస్తున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. మంగళవారం అయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన సందర్బంగా ఆయన మాట్లాడారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో 18 మంది లబ్ధిదారులకు ₹ 13’49,500 మంజూరయ్యాయని ఒకే మొత్తంలో ఇంత మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు కావడం నియోజకవర్గానికే గర్వకారణం అన్నారు. గత ప్రభుత్వాలు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆయా పార్టీల నాయకులకు, కార్యకర్తలకు మాత్రమే అందించేవి అని, సామాన్యుడికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందని ద్రాక్ష లా మిగిలి పోయెదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం సామాన్యుడికి కూడా అందుబాటులోకి తెచ్చి పేదల ఆరోగ్యానికి బాసటగా నిలిచి ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో బెల్లంపల్లి ఎంపీపీ గోమాస శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రాణి-సురేష్, బెల్లంపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, సోమగూడెం సర్పంచ్ ప్రమీల గౌడ్, కాసిపేట వైస్ ఎంపీపీ విక్రమ్, నాయకులు భీమా గౌడ్, మల్లేష్, రవితేజ, తిరుపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.