Tuesday, 3 November 2026

మంథని మున్సిపల్ లో అభివృద్ధి పనులకు 36 లక్షల నిధులు మంజూరు – మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు సిడిపి క్రింద 36 లక్షల నిధులు మంజూరైనట్లు మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. మంథని బోయిన్ పేటలో యాదవ సంఘ కమ్యూనిటీ హాల్ కు 10 లక్షలు, లక్ష్మీ దేవర కమ్యూనిటి హల్స్ లకు 5 లక్షలు, ఖన్సాయిపేట ఆంజనేయస్వామి టెంపుల్ కి 2 లక్షలు, మంథని మున్సిపాలిలోని మసీదు వాడ ,గ్రేవియాడుకు రెండు ఐమాస్ లైట్స్ -2 లక్షల 50 వేలు, మంథని ముత్యాలమ్మ వాడలోని కోర్టు వద్ద ఓపెన్ జిమ్ 4 లక్షలు, అరేంద లోని శివాలయం వద్ద బోర్బోర్, మోటార్ కోసం 1లక్ష 25 వేలు, మంథని మున్సిపాలిటీలో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ వద్ద మెటల్ రోడ్డు, నడి విదిలో, చైతన్యపురి కాలనీలో సీసీ రోడ్డు ఇతర పనుల సంబందించిన 15 లక్షలు మంజూరైనట్లు శ్రీధర్ బాబు తెలిపారు. పెద్దపల్లి జిల్లా కు సంబంధించిన జిల్లా కలెక్టర్ నుండి చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ ద్వారా మంగళవారం మంథని మున్సిపాలిటీ సంబంధించిన 36 లక్షల రూపాయల కు సంబంధించిన వర్క్స్ మంజూరు కావడం జరిగిందన్నారు. మంథని మున్సిపల్ అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయించిన దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి మంథని మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలిపారు.