పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే హన్మంత్ షిండే
బిచ్కుంద ఆగస్టు 29 (జనంసాక్షి) పేదల శ్రేయస్సు కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మండలకేంద్రంలో 35 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మణ్, ఎంపీపీ అశోక్ పటేల్, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బస్వరాజ్ పటేల్, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్నాథ్ పటేల్, కృష్ణా, సర్పంచి సంగీత, ఎంపీటీసి సాయిలు, డాక్టర్ రాజు మరియు వెంకట్రావు దేశాయ్ తదితరులు పాల్గొన్నారు.