విద్యుత్ షాక్ తో ఆవు మృతి.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:
విద్యుత్ షాక్ తో ఆవు మృతి చెందిన సంఘటన మంగళవారం నాగర్ కర్నూల్ మండల పరిధిలోని గుడిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.గ్రామానికి చెందిన దామోదర్ రెడ్డి కి చెందిన ఆవు వ్యవసాయ పొలంలో నుండి వస్తుండగా చెన్నారి చిన్నయ్య వ్యవసాయ పొలంలో కంచెకు విద్యుత్తును ఏర్పాటు చేయడం వల్ల దానిని తాకిన ఆవు అక్కడికక్కడే మృతి చెందినట్లు బాధితుడు తెలిపారు. ప్రమాదాలకు కారణమయ్యే విద్యుత్ తీగలను ఉంచరాదని నిబంధన ఉన్నప్పటికీ ఏర్పాటు చేయడం వల్ల తమ ఆవు మృతి చెందిందని ఆవుకు నాలుగు నెలల చిన్న దూడ ఉన్నట్లు తెలిపారు.వెంటనే విద్యుత్ శాఖ అధికారులు చిన్నయ్య పై చర్యలు తీసుకొని తనకు న్యాయం చేయాలని విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశారు