బీఎస్పీ పార్టీ జిల్లా ఇన్చార్జి ఎం.జీ కృష్ణ
ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 29 : సెప్టెంబర్ 6 తేదీన జరిగే చలో బహుజన దివ్యాంగుల సభను విజయవంతం చేయాలని జోగులాంబ గద్వాల జిల్లా బిఎస్పి పార్టీ జిల్లా ఇంచార్జి ఎం. జి కృష్ణ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని ఎర్రవల్లి చౌరస్తాలోని ఎంజి భవన్ దగ్గర ఎం.జి కృష్ణ, బీఎస్పీ పార్టీ మండల అధ్యక్షుడు పి.యువరాజు ఆధ్వర్యంలో వచ్చేనెల 6వ తేదీన అయిజ పట్టణ కేంద్రంలోని ఓల్డ్ ఠాగూర్ స్కూల్ గ్రౌండ్ లో జరగే ఛలో బహుజన దివ్యాంగుల భరోసా సభకు సంబంధించి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులకు మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. దివ్యాంగుల హక్కులకోసం అందరూ ఏకం కావలసిన సమయం ఆసన్నమైందన్నారు. కనుక సభకు దివ్యాంగులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు, మండల ప్రధాన కార్యదర్శి ఎస్ ఉపేందర్, మండల సెక్రెటరీ రవి, కొండేరు మధు, ఇటిక్యాల బిసన్న, సాతర్ల విజయ్, వెంకటేష్ నవీన్, బీసన్న, కొండేరు రాముడు తదితరులు పాల్గొన్నారు.




