Thursday, 5 November 2026

పేదల సంక్షేమానికి టీటీడీపీ కృషి

– చంద్రబాబు నాయకత్వంలోనే అన్ని వర్గాల అభివృద్ధి
– మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు
కాకినాడ, నవంబర్‌12(జ‌నంసాక్షి) : తెలుగుదేశం పార్టీ పేదల సంక్షేమంకోసం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట మునిసిపాలిటీ పరిధిలో 1,2,3 వార్డుల్లో ఆయా వార్డుల కౌన్సిలర్‌ లు అత్తిలి సత్యనారాయణ, చుండ్రు రాంబాబు, చాపల కాంతిల ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వార్డు దర్శిని కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పేదల సంక్షేమం కోసం తమ పార్టీ ఎన్నో కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆదరణ వంటి కార్యక్రమాలు బిసి వర్గాలకు చేదోడుగా ఉంటుందన్నారు. సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇతర అభివృద్ధి కార్యక్రమలు సిఎం చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్నారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఎన్నికల హావిూలన్నింటిని నెరవేర్చిందన్నారు. ప్రజలంతా వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. విరభద్రపురం, గొల్లల గుంట, శ్రీనర్‌ కాలనీ, వాసవి నగర్‌, బాపూజీ స్కూల్‌ ఏరియాలలో పర్యటించారు. ఒక్కొక్కరి వద్దకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కారించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.  అనంతరం చైర్‌పర్సన్‌ చుండ్రు శ్రీవరప్రకాష్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి అర్హులకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే వేగుళ్ళ నిరంతరం అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ తో ఎమ్మెల్యే వేగుళ్ళ ను గెలిపించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు వి సాయి కుమార్‌ బాబు,టిడిపి యువ నేత వేగుళ్ళ అజయ్‌ బాబు,మాజీ ఎమ్మెల్యే వల్లూరి నారాయణ రావు,
టౌన్‌ టీడీపీ అధ్యక్షుడు ఉంగరాల రాంబాబు,జిల్లా ఎస్సి సెల్‌ అధ్యక్షులు వెంట పల్లి జాన్‌ మార్క్‌, అన్నవరం దేవస్థానం కమిటీ సభ్యులు అవసరాల వీర్రాజు,పట్టణ మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కొనే ఉమామహేశ్వరి, టిడిపి నాయకులుశిరంగు ఈశ్వర్‌, చాపల వీరబాబు, పలివేల నాగు, గడి రాంబాబు, పాలచర్ల శిరీష్‌ అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.