రఘునాథ పాలెం జూన్ 04 (జనం సాక్షి)మండలం లచ్చిరామ్ తండాలో నూతనంగా నిర్మాణమవుతున్న ముత్యాలమ్మ తల్లి గుడి ప్రతిష్టకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విరాళం యాబై వేల రూపాయలు ప్రకటించారు. ఆ నగదును క్యాంపు కార్యాలయంలో పీఏ చిరుమామిళ్ల రవికిరణ్ గుడి ప్రతిష్ట కమిటీ వారికి అందజేశారు.ఈ సందర్భంగా కమిటీ వారు మంత్రి పువ్వాడకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విగ్రహ ప్రతిష్ఠ కమిటీ నిర్వాహకులు రాంబాబు,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి మంత్రి పువ్వాడ విరాళం




